మాయావతి గారిని ప్రధానిగా చూడాలని ఉంది !

15
Mayawati-insulted-Pawan-Kalyan

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ శుక్రవారం లక్నో వెళ్లారు.. అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినాయకురాలు మాయావతి గారితో భేటీ అయ్యారు.వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీఎస్పీ-జనసేన కలిసి పోటీ చేసే అంశంపై ఆమెతో చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. ఈ దేశానికి మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని..మాయావతి గారిని ప్రధానిగా చూడాలని ఉందని అన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన పవన్‌కళ్యాణ్..ఇప్పుడు బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని కలిగిస్తుంది.

ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన జనసేనాని.. మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు గురువారం సాయంత్రం రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ మేనిఫెస్టోను పవన్ విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here