ఎన్నికల్లో పోటీ చేయనున్న పరిటాల సునీత తనయుడు !

72
paritala sri ram

మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ ఎన్నికల్లో అతని సొంత నియోజకవర్గం రాప్తాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా తన తనయుడు శ్రీరామ్‌ను బరిలోకి దించాలని నిర్ణయించామని మంత్రి సునీత తెలిపారు. కుటుంబ సభ్యులు, పరిటాల అభిమానుల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తమ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాలని అధినేత చంద్రబాబును కోరామని.. వీలుకాకపోతే రాప్తాడు నుంచి శ్రీరామ్‌ బరిలో ఉంటారని సునీత స్పష్టం చేశారు. గురువారం చంద్రబాబును కలిసి తమ నిర్ణయాన్ని చెబుతామన్నారు. గత ఎన్నికల నుంచి పార్టీ వ్యవహారాల్లో పరిటాల శ్రీరామ్‌ క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మంత్రిగా తల్లి సునీత ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్న సమయాల్లో కార్యకర్తలకు, నేతలకు ఆయన అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here