సైనా బయోపిక్ లో శ్రద్ధ ప్లేస్ లో పరిణీతి చోప్రా !

34
parineeti Shraddha

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ బాడ్మింటన్ క్రీడాకారిణి ‘సైనా నెహ్వాల్’ బయోపిక్‌ చేస్తుందని ఆ మధ్య ప్రకటన మరియు ప్రీ లుక్ కూడా వచ్చింది.. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి శ్రద్ధ తప్పుకొన్నారు..శ్రద్ధకు డెంగీ జ్వరం రావడంతో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారు. ఈ విషయాన్ని సినిమాను తెరకెక్కిస్తున్న టీ సిరీస్‌ సంస్థ అధినేత భూషణ్‌కుమార్ వెల్లడించారు. శ్రద్ధ స్థానంలో సినీ నటి పరిణీతి చోప్రాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ‘సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటించబోతున్న పరిణీతి చోప్రాకు స్వాగతం’ అని పేర్కొంటూ పరిణీతి ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ సినిమా కోసం శ్రద్ధ.. సైనా కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వద్ద నెల రోజుల పాటు బ్యాడ్మింటన్‌లో మెళకువలు కూడా నేర్చుకున్నారు. ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు. సినిమాను ఈ ఏడాదిలోనే పూర్తిచేసి 2020 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు నిర్మాత భూషణ్‌కుమార్‌ వెల్లడించారు. అమోల్‌ సేన్‌ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం శ్రద్ధ ‘సాహో’, ‘ఏబీసీడీ 3’, ‘బాఘి 3’, ‘చిచ్ఛోరే’ సినిమాల్లో నటిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here