కత్తెరను కడుపులోనే వదిలేసిన డాక్టర్లు !

65
Telugu-image

హైదరాబాద్ పాతబస్తీలోని మంగళహాట్‌కు చెందిన మహేశ్వరి అనే మహిళ హెర్నియాతో బాధపడుతూ మూడు నెలల క్రితం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో ఆమెకు గతేడాది డిసెంబరు 2న ఆపరేషన్ చేసి కొద్దిరోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ మహిళ రోజూ కడుపునొప్పితో బాధపడుతుండేది. ఆరోగ్యం రోజురోజుకీ దిగజారడంతో శనివారం ఉదయం ఆమెను నిమ్స్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్స్‌రేలో కత్తెర స్పష్టంగా కనిపించడంతో డాక్టర్లు, రోగి బంధువులు షాక్‌కు గురయ్యారు.

డాక్టర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోగి బంధువులంతా నిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపుతప్పడంతో నిమ్స్ వైద్యులు రంగంలోకి దిగారు. ఆమెను వెంటనే గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి తరలించి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియరాలేదు. ఆపరేషన్ చేసే సమయంలో నిమ్స్ డాక్టర్లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు కోప్పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here