ఫిబ్రవరి 14 న మజిలీ టీజర్ !

67
DzM8aToUYAA-UJo

అక్కినేని నాగచైతన్య ,సమంత జంట తమ వివాహం తర్వాత “మజిలీ” అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాను నిన్ను కోరి సినిమా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు.. వివాహం అయిన జంట మధ్య గల కథని ఈ సినిమాలో చూపించనున్నారు.. హీరోకి పెళ్లి కాకముందు ఉన్న గతంతో సినిమా స్టోరీ ముడిపడి ఉంటుందేమో అని అనిపిస్తుంది.. హీరో(నాగ చైతన్య) ఫ్లాష్ బ్యాక్ లో ఒకరిని ప్రేమించడం.. ఆ అమ్మాయిని కాకుండా హీరోయిన్ ని (సమంత) పెళ్లి చేసుకోవడం.. పెళ్లి అయ్యాక ఆ ప్రేమ విషయం హీరోయిన్ కి తెలిసి గొడవలు రావడం లాంటి కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారేమోనని అనిపిస్తుంది.. ఇక ఈ సినిమా టీజర్ ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఉదయం 9గంటలకు రిలీజ్ చేయనున్నారు..మార్చి లేదా ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేస్తారు.. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here