తల తీసేసారు కానీ 18 నెలలు బ్రతికింది !

120
chicken

మైక్ అనే ఈ కోడి తల లేకుండా 18 నెలలు జీవించింది. అసలు అలా తల లేకుండా బతకడం నిజంగా సాధ్యమా ?

1945‌లో అమెరికాలోని కొలరాడోకు చెందిన ఓల్సెన్ అనే రైతు కోడి తలను నరికేశాడు. కానీ, ఆ కోడి చావలేదు..దీంతో ఆశ్చర్యపోయిన ఓల్సెన్ దాన్ని అలాగే వదిలేశాడు.

మైక్ కూడా ఏమీ జరగనట్లే సాధారణంగా జీవించడం మొదలుపెట్టింది.అయితే, కళ్లు, ముక్కు, నోరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడేది. ఆహారం తీసుకోలేకపోయేది.దీంతో ఒల్సెన్.. ఐడ్రాప్ సాయంతో మైక్‌ గొంతులోకి ఆహారం పంపేవాడు.కోడి తలలేకుండా బతికేస్తోందనే సమాచారం ప్రపంచమంతా తెలిసింది. దీంతో మైక్ పేరు మారుమ్రోగింది.

18 నెలల తర్వాత మైక్ చనిపోయింది. అప్పటి నుంచి దాన్ని ‘మిరాకిల్ మైక్’గా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి ప్రత్యేకంగా కొలరాడాలో లోహ విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేశారు..ఇదే వింత ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో కూడా చోటుచేసుకుంది. అక్కడ కూడా ఓ కోడి తల లేకుండా బతికేస్తోంది. ఆ కోడి ఇంకా బతికే ఉంది.
సాధారణంగా తల నరికితే కోడి చనిపోతుంది. అయితే, మైక్ మెదడుతో అనుసంధానమై ఉండే గండిక సిరను ఓల్సెన్ కట్ చేయలేదు. మైక్‌ తన మెదడులో కొంత భాగం మాత్రమే నష్టపోయింది. దీంతో అది తల లేకున్నా మామూలుగానే నడిచింది. నిజంగా ఇదొక మిరాకిల్ ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here