‘అమిత్‌ షా క్షమాపణలు చెప్పాల్సిందే’ – ముఫ్తీ

32
mehbooba

జమ్మూ: భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా దేశ పునాదులనే కదిలించాలని చూస్తున్నారని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఇటీవల జాతీయ పౌరసత్వ నమోదుపై ఆయన చేసిన వ్యాఖ్యలకుగానూ ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ దేశం అన్ని వర్గాల వారికి చెందినదని.. అనుచిత వ్యాఖ్యలతో దేశంలో అనిశ్చితి నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అమిత్‌ షా వ్యాఖ్యలు దేశ లౌకికత్వంపై దాడి చేయడమేనన్నారు. ‘‘ఓట్ల కోసం అమిత్‌ షా ఉపయోగిస్తున్న భాష ఆక్షేపణీయం. ఈ దేశపు లౌకికత్వ సిద్ధాంతాల వల్లే జమ్మూకశ్మీర్‌ భారత్‌లో విలీనం అయింది. ఈ దేశ పునాదులే లౌకికత్వంపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆయన కచ్చితంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టికను ప్రవేశపెడతామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని అధికరణం 370ని కూడా రద్దు చేస్తామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here