మెగా స్టార్ కుటుంబం మంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.. చిరంజీవి,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,అల్లు అర్జున్ వీళ్లంతా ఎప్పుడైనా ఎవరికైనా సహాయం అవసరమైతే వెళ్లి తమ వంతు సహాయాన్ని అందిస్తారు..ఈరోజు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఈరోజు ఆయన అపోలో హాస్పిటల్ కి వెళ్లి తన ఆర్గాన్స్ ని డొనేట్ చేస్తున్నట్లు సంతకం పెట్టారు.. ఈరోజే ఆయన ట్విట్టర్ లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు.. ఈ మంచి విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని ఫోటోలు పోస్ట్ చేశారు.. మనం పోయిన తర్వాత కూడా ఇంకా బ్రతికుండాలంటే ఆర్గాన్స్ ను డొనేట్ చేయండి అని ఆయన చెప్పారు..
కళ్యాణ్ దేవ్ “విజేత” అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.. ఆ సినిమాలో ఆయన బాగానే నటించారు.. మంచి ప్రశంసలు అందుకున్నారు.. త్వరలోనే ఆయన రెండో సినిమా కూడా ప్రారంభం కానుంది..