త్వరలో నిహారిక పెళ్లి : నాగబాబు

72
nagababu

మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారిక వివాహం గురించి మీడియా ముందు మాట్లాడారు.. నా కూతురు యాక్టింగ్ చేస్తానంటే ఒప్పుకున్నాను.. 2019 వరకు టైం ఇస్తానని చెప్పాను..ఇచ్చాను..ఇక మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను.. సంబంధాలు చూస్తున్నాను.. నాకు కులంతో పట్టింపు లేదు.. అబ్బాయి గుణం,రూపం బాగుంటే చాలు.. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా బాగుండాలి.. నిహారిక నటించిన ఒక మనసు సినిమా సరిగా ఆడలేదు.. తర్వాత తమిళ్ లో చేసిన సినిమా పర్లేదు అన్నట్టుగా ఆడింది.. ఆ తర్వాత చేసిన హ్యాపీ వెడ్డింగ్ కూడా సరిగా ఆడలేదు.. మధ్యలో ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ చేసింది.. అది మంచి హిట్ అయ్యింది.. ఇప్పుడు సూర్యకాంతం సినిమా చేస్తుంది.. తనకు నేను ఇచ్చిన టైం ఐపోయింది.. త్వరలోనే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయనున్నట్లు నాగబాబు చెప్పారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here