డాన్స్ మాస్టర్ జానీకి 6నెలల జైలు శిక్ష విధించిన కోర్టు !

35
johny

టాలీవుడ్‌లో స్టార్ హీరోలంద‌రితో పని చేసిన ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై 2015లో 354, 324, 506 సెక్షన్ల కింద కేసు న‌మోదైంది. దీనిపై విచారించిన మేడ్చ‌ల్ కోర్టు అతనికి ఆరు నెల‌ల జైలు శిక్షతో పాటు 1500 జరిమాన విధిస్తూ తీర్పునిచ్చింది. జానీ మాస్ట‌ర్‌తో పాటు మరో ఐదుగురు కూడా దోషులుగా తేల‌డంతో వారికి కూడా శిక్ష విధించింది కోర్టు . వివ‌రాల‌లోకి వెళితే 2015లో మేడ్చ‌ల్ మండలంలోని కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వ‌హించిన ఓ ఈవెంట్‌కి తన టీం తో హాజ‌ర‌య్యారు జానీ మాస్ట‌ర్ . ఓ పాట విష‌యంలో వీరికి , మ‌రో టీంకి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ గొడవలో డ్యాన్స్ మాస్టర్ జానీ బృందం తమపై దాడికి పాల్పడ్డారని మరో బృందం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు జానీ మాస్టర్‌తో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ పై అప్ప‌ట్లో కేసు న‌మోదు చేశారు . ఇన్నాళ్ళు విచార‌ణ జ‌రుపుకున్న ఈ కేసుకి సంబంధించి తాజాగా తీర్పు వెలువ‌డింది. 2009లో ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా కెరియర్ మొదలుపెట్టిన జానీ మాస్ట‌ర్ ఇటీవ‌ల ఖైదీ నెం. 150, రంగస్థలం, అరవింద సమేత, బాహుబలి, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు పనిచేసారు. ప‌లు రియాల‌టీ షోస్‌కి జ‌డ్జిగా కూడా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here