‘మన్మథుధుడు 2’లో నాగ్‌ లుక్‌ చూశారా..!

28
manmadhudu-2-looks

సినిమా సినిమాకీ టాలీవుడ్‌ ‘కింగ్’ అక్కినేని నాగార్జున మరింత హ్యాండ్సమ్‌గా తయారవుతున్నారు. ఆయన కథానాయకుడిగా ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోర్చుగల్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్‌.. నాగ్‌కు సంబంధించిన లుక్స్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.

‘దిస్‌ మ్యాన్‌.. ఫిట్‌నెస్‌ గోల్స్‌. కింగ్‌ ఫ్యాన్స్‌.. ఈ ఒక్క సీన్‌ మాత్రం మీకోసమే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఫొటోలో నాగ్‌ కసరత్తులు చేస్తూ కనిపించారు. ఈ లుక్‌లో ఆయన మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తు్న్నారు. సమంత అతిథి పాత్రలో కనిపిస్తారు.

నాగార్జున, పి.కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా కథ దాదాపుగా పోర్చుగల్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ షెడ్యూల్‌తోనే పాటలతో పాటు టాకీ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. లక్ష్మి, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, నాజర్‌, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here