అవసరమైతే రెస్ట్ తీసుకోవాలి !

51
virat2

ఐపీఎల్‌ అయిపోగానే వన్డే ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది.ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వర్క్ లోడ్ టీమ్‌ ఇండియా ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశముందని, ముఖ్యంగా బౌలర్లు గాయాలు పాలయ్యే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లి మాత్రం ఈ విషయంలో ఆటగాళ్లే తెలివిగా వ్యవహరించాలని అంటున్నాడు. ఎప్పటికప్పుడు ఆటగాళ్లు తమపై పడే పనిభారాన్ని సమీక్షించుకోవాలని, అవసరమైతే రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నాడు. ఏడాదికోసారి వచ్చే ఐపీఎల్‌ కంటే వన్డే ప్రపంచకప్‌కే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని అన్నాడు. ‘‘ప్రపంచకప్‌ నాలుగేళ్లకోసారి వస్తుంది.దీని ప్రాముఖ్యత అందరికీ తెలుసు. ఇది దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌లో పనిభారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనిపై మేం చర్చించుకున్నాం. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో కూడా మాట్లాడతాం. ఎప్పటికప్పుడు పనిభారాన్ని సమీక్షించుకోవాల్సిన బాధ్యత ఆటగాళ్లదే. భారం ఎక్కువవుతుందని భావిస్తే విరామాలు తీసుకోవాలి. అలాగని ఐపీఎల్‌ పట్ల మాకు అంకితభావం లేదని కాదు. కానీ ప్రపంచకప్‌ ప్రాధాన్యత గురించి చెబుతున్నాం. ఏ ఒక్కరు గాయపడినా, ఫిట్‌గా లేకున్నా ప్రపంచకప్‌ జట్టు సమతూకం దెబ్బ తినే అవకాశముంది’’ అని అన్నాడు. ఐపీఎల్‌ మార్చి 23న ప్రారంభమవుతుండగా, ప్రపంచకప్‌ మే 30 నుంచి మొదలుకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here