నేను బికినీ వేసుకుంటా..వేసుకోను..అడగడానికి ఆయనెవరు !

35
dc-Cover-3112dalqfom1fs3qhsitkrs5d1-20170116113440.Medi

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ కి వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతుంది..అయితే సోషల్ మీడియాలో తన భర్తపై కామెంట్‌ చేసిన ఒక నెటిజన్‌కు కరీనా దీటైన జవాబిచ్చారు..బికినీలు వేసుకుని కొన్ని అంతర్జాతయ మ్యాగజైన్లకు ఫొటోషూట్లు ఇచ్చే కరీనా ఇటీవల కరీనా బికినీ ధరించి .. తన భర్త సైఫ్‌ అలీ ఖాన్‌తో కలిసి ఓ ఫొటో దిగారు.ఆ ఫొటోలను కరీనా అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. దాంతో ఆ ఫొటోపై పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. బికినీలు వేసుకోవాలని సైఫే కరీనాను ప్రోత్సహిస్తున్నారని, వారికి సిగ్గులేదని దూషించారు. ఈ ట్రోల్స్‌పై తాజాగా ఓ మీడియా ద్వారా కరీనా స్పందిస్తూ.. ‘అసలు నన్ను బికినీ వేసుకోమని చెప్పడానికి ఆయన (భర్తను ఉద్దేశిస్తూ) ఎవరు? సైఫ్‌తో నాకున్న అనుబంధం.. నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయించే స్థాయిలో లేదు. ‘ఎందుకు బికినీలు వేసుకుంటావు? ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు?’ అని నా భర్త నన్ను ఎప్పుడూ అడిగింది లేదు. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం బాధ్యతతో కూడుకున్నది. ఆయనకు నాపై నమ్మకం ఎక్కువ. నేను బికినీ వేసుకున్నానంటే కచ్చితంగా దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన ఫొటోలో నేను బికినీ వేసుకున్నాను. ఎందుకంటే నేను ఆ సమయంలో ఈత కొట్టడానికి వెళ్లాను.’ అని వెల్లడించారు కరీనా. వర్క్‌ పరంగా ప్రస్తుతం కరీనా ‘గుడ్‌న్యూస్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 6న ఈ చిత్రం రిలీజ్ కానుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here