ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా రేడియోలో అడుగుతారా సైఫ్‌?

69
595117-saif-kareena-072417

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ‘ఇష్క్‌ ఎఫ్‌ఎం’ అనే నేషనల్ లెవెల్ లో నిర్వహిస్తున్న రేడియో షోకు ఆర్జేగా వ్యవహరిస్తున్నారు. ‘వాట్‌ వుమెన్‌ వాంట్‌’ అనే కార్యక్రమంలో మాత్రమే ఆమె అభిమానులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో కరీనా భర్త సైఫ్‌ అలీ ఖాన్‌ ఆమెను ఓ ప్రశ్న అడిగారు. ‘పిల్లలు పుట్టాక ఒకరికోసం ఒకరికి సమయం ఉండదని అంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు భార్య దృష్టిని మావైపునకు ఎలా మళ్లించుకోవాలి?’ అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కరీనా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా రేడియోలో అడుగుతారా సైఫ్‌? నువ్వు అడిగావు కాబట్టి నేను సమాధానం చెప్తాను. భర్త ఎప్పుడూ భార్య కోసం సమయం కేటాయించాలి. బిడ్డ పుట్టిన తర్వాత బాధ్యతలుపెరుగుతాయి. ఆ బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. అప్పుడు భార్య ఆటోమేటిక్‌గా సంతోషంగా ఉంటుంది. ఇక ఆమె దృష్టిని మీవైపు మళ్లించుకోవాలని అనుకుంటే.. ఆమెను ఓ అందమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. ఒకవేళ తనకు బిడ్డతో సమయం గడపాలనుంది అన్నప్పుడు చిన్నబుచ్చుకోకండి. దానర్థం ఆమెకు మీపై ప్రేమ తక్కువ అని కాదు. ఏదేమైనా నన్ను త్వరలో ఓ అందమైన ప్రదేశానికి తీసుకెళతావని ఆశిస్తున్నా’ అని కరీనా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here