అందుకే ఓడిపోయాం : విలియమ్సన్‌

128
SRHKB1

రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ కన్నె విలియమ్సన్‌ గాడిన పెడ్తారని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్‌రైజర్స్‌ 39 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఓపెనర్లు బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్లు మినహా ఎవరూ రెండెంకల స్కోర్‌ను చేయలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్‌కు పరాజయం తప్పలేదు. అయితే తమ ఓటమికి భాగస్వామ్యాల నమోదు కాకపోవడం..ప్రత్యర్థి జట్టు తమకన్నా మెరుగ్గా ఆడటమే కారణమని విలియమ్సన్‌ అభిప్రాయపడ్డాడు.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ  ‘బౌలింగ్‌లో మేం అద్భుతంగా రాణించాం, కానీ బ్యాటింగ్‌లో తడబడ్డాం. మా చెత్త ఆటకు తోడు ప్రత్యర్థుల అద్భుత ప్రదర్శన మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఢిల్లీ ఆటగాళ్లు పరిస్థితులు అందిపుచ్చుకొని చెలరేగారు. ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడాదు. ముఖ్యంగా ఐపీఎల్‌లో అయితే మరి. టోర్నీలో ఏ జట్టైనా ఎవరినైనా ఓడగట్టవచ్చు. కేవలం మన ఆట, ప్రణాళికలను మాత్రం అమలు చేయాలి. మా ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. కానీ ఢీల్లి మా కన్న అద్బుతంగా ఆడింది. ఈ గెలుపు క్రెడిట్‌ వారిదే’ అఅని విలియమ్సన్‌ చెప్పుకొచ్చాడు. ఇక హైదరాబాద్‌ తన తదుపరి మ్యాచ్‌ను టోర్నీ టాపర్‌ చెన్నైసూపర్‌ కింగ్స్‌తో బుధవారం చెన్నై వేదికగా ఆడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here