కరీనా మళ్లీ వస్తోంది…

57
kareena

బహుశా కరీనా ఇక సినిమాల్లో కనిపించక పోవచ్చు అనే పుకార్లు వచ్చాయి. వాటికి సమాధానంగా తల్లయ్యాకా ఆమె నటించిన ‘వీరె దె వెడ్డింగ్‌’ భారీ విజయం అందుకొంది. దీంతో కరీనా మళ్లీ తిరిగొచ్చింది అన్నారంతా. ఆ మాటే ఆమెకు అసలు నచ్చలేదట. ‘‘వీరె దె వెడ్డింగ్‌’ సమయంలో అందరూ కరీనా మళ్లీ వస్తోంది అంటూ మాట్లాడారు. మళ్లీ రావడానికి నేను ఎక్కడికీ వెళ్ల లేదు కదా. ఓ బిడ్డకు జన్మనిచ్చానంతే. పిల్లలను కనడం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ సహజంగా జరిగే అందమైన ప్రక్రియ. అది నా జీవితంలోనూ జరిగింది. అంతమాత్రానికే కరీనా తల్లైపోయింది… కెరీర్‌ దెబ్బతింది అంటూ ఏవేవో వార్తలు రాసేయాలా? ‘కరీనా మళ్లీ వచ్చింది’ ఆ మాటే నచ్చలేదు’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టింది కరీనా. ‘‘ఇనేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాలేదు. పెళ్లైనా…తల్లైనా కొత్త కథలవైపే ప్రయాణిస్తున్నాను. అవేవీ నా కెరీర్‌కు అడ్డంకి కాలేదు. కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే కథానాయికల వద్దకు ఎలాంటి కథలు వస్తాయో అలాంటి అవకాశాలు నా వద్దకు వస్తున్నాయి. పిల్లల్ని కంటే కెరీర్‌లో రాణించలేం అని కొంతమంది అనుకుంటున్నారేమో. నేనేంటో, నా ప్రతిభ ఏంటో దర్శకనిర్మాతలు…ప్రేక్షకులకు తెలుసు’’ అంటోంది కరీనా. ఆమె ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌ ‘గుడ్‌ న్యూస్‌’, కరణ్‌జోహార్‌ ‘తఖ్త్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

తైమూర్‌ పుట్టాకా మీరు నటించే ప్రకటనల ఎంపిక విషయంలో మార్పులేమైనా వచ్చాయా? అంటే…‘‘నేను ఎప్పుడూ మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో నటించలేదు కదా. ఆ మూడు ప్రకటనల్లో నటించకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అలాంటప్పుడు కొత్తగా మార్పులేమి ఉంటాయి?’’ అంది కరీనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here