పాకిస్తాన్ లో ఐపీఎల్ జరగనుందట !

39
IPL-logo

తొందరపాటులో నోరుజారడం ఆ తర్వాత విమర్శలు ఎదుర్కోవడం పాకిస్థాన్ క్రికెటర్లకి అలవాటే. శ్రీలంక జట్టుపై దాడి అనంతరం పాకిస్థాన్‌లో అడుగు పెట్టేందుకే దశాబ్దకాలంగా అగ్రదేశాల క్రికెటర్లు జంకుతుంటే..? ఏకంగా ఆ గడ్దపై ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ నోరుజారాడు. పాకిస్థాన్ మినహా క్రికెట్‌ ఆడే అన్ని అగ్ర దేశాల ఆటగాళ్లూ ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.

భారత్‌ వేదికగా జరిగే ఐపీఎల్‌లో పాకిస్థాన్ క్రికెటర్లను ఆడించడంలేదని ఆ దేశం పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)ని ప్రవేశపెట్టింది. కానీ.. విదేశీ ఆటగాళ్లు పాక్‌‌లో ఆడేందుకు అయిష్టత వ్యక్తం చేయడంతో దుబాయ్ వేదికగా లీగ్ మ్యాచ్‌లు,ప్లేఆఫ్, ఫైనల్‌ను మాత్రం స్వదేశంలో ఆడిస్తోంది. తాజాగా ఈ లీగ్‌ను ప్రమోట్ చేసే క్రమంలో ఉమర్ అక్మల్ పొరపాటున పీఎస్‌ఎల్ స్థానంలో ఐపీఎల్ అనేశాడు. అయితే.. వెంటనే ఆ తప్పిదాన్ని అతను దిద్దుకున్నా..అభిమానులు మాత్రం ఏకిపారేస్తున్నారు.

umarakmal-1552297846

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here