త్వరలో సానియా మీర్జా బయోపిక్ !

90
sania-mirza-file-afp

“ఏస్‌ ఎగెనెస్ట్‌ ఆడ్స్‌” పేరుతో తన జీవిత కథని పుస్తక రూపంలో తీసుకొచ్చింది భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా.. అయితే ఇప్పుడు తన కథని బయోపిక్ గా తీసుకరాబోతున్నారు..ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ కి సైన్ చేశానని సానియా చెప్పారు.. నాపైన తీస్తున్న బయోపిక్ కాబట్టి నా ఇన్ పుట్స్ చాలా అవసరం ఉంటాయి..అందరం కలిసి పనిచేయబోతున్నాం..ఇంకా ఈ సినిమా స్క్రిప్ట్ పని ప్రారంభ దశలోనే ఉంది. నటులు, రచయితలు ఎవరూ అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇకపై పరస్పర సహకారంతో ముందుకు వెళతాం అని సానియా చెప్పారు.. ఈమధ్య బయోపిక్ ల హవా నడుస్తుంది.. రాజకీయ నాయకులు,సినీ ప్రముఖులు,క్రీడాకారుల జీవితాలను బయోపిక్ గా మన ముందుకు తీసుకొస్తున్నారు.. ఇదివరకే ధోని,మేరీ కోమ్,మిల్కా సింగ్, మహవీర్‌ సింగ్(దంగల్‌)ల వంటి క్రీడాకారుల జీవితం ఆధారంగా సినిమాలు వచ్చాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here