భారత క్రికెటర్ పై దాడి !

58
add_text

ఢిల్లీలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అమిత్ భండారిపై ఓ క్రికెటర్ స్నేహితులు వచ్చి దాడి చేశారు. రాష్ట్ర అండర్-23 జట్టు సెలెక్షన్స్ జరుగుతున్నాయి.. ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) సీనియర్ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న భండారి.. యువ క్రికెటర్ల ఆటని పరిశీలిస్తున్న సమయంలో జట్టులోకి ఎంపికవని ఓ క్రికెటర్.. అసంతృప్తితో తన స్నేహితులతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో అమిత్ భండారి తల, చెవి భాగంలో గాయాలవగా అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

DzHeXj2WoAALH2X

ఢిల్లీ అండర్-23 టీమ్‌ మేనేజర్‌ శంకర్ సైనీ కథనం ప్రకారం.. ‘టీమ్ ట్రయల్స్‌ని సెలక్టర్లతో కలిసి అమిత్ భండారీ పరిశీలిస్తుండగా.. నేను భోజనం కోసం అక్కడే ఏర్పాటు చేసిన టెంట్‌లోకి వెళ్లాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి భండారీతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ.. నిమిషాల వ్యవధిలోనే అనూహ్యాంగా ఓ 15 మంది హాకీ స్టిక్స్, రాడ్స్, సైకిల్ చైన్లతో వచ్చి భండారీపై దాడికి దిగారు. దీంతో.. అక్కడ ట్రయల్స్ కోసం వచ్చిన యువ క్రికెటర్లు ఆ మూకని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే భండారీని వారు గాయపర్చారు. ఆ దుండగులు అక్కడి నుంచి వెళ్తూ.. జట్టులోకి తీసుకోలేదో..? కాల్చి పారేస్తాం..! అని భండారీని హెచ్చరించారు’ అని తెలిపారు..

DzHiWsrWkAAiqcX

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here