ధరమ్‌ తేజ్‌ కు పవన్‌ ప్రశంసాలు

14
Pawan-Warned-Sai-Dharam-And-Varun-Tej

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘చిత్రలహరి’ సినిమాను వీక్షించారు. విజయవాడలో ఎన్నికలకు సంబంధించిన పనులన్నీ పూర్తిచేసుకుని మంగళవారం సాయంత్రం పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం కుటుంబంతో కాసేపు గడిపి ‘చిత్రలహరి’ సినిమాను వీక్షించారు. సినిమా తనకు చాలా నచ్చిందని ఓ పేపర్‌పై రాసి బొకేలను ‘చిత్రలహరి’ బృందానికి పంపించారు.
‘డియర్‌ సర్‌.. కంగ్రాట్స్‌.. మీరు తీసిన సినిమాను నేను బాగా ఎంజాయ్‌ చేశాను’ అని పవన్‌ పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత ధరమ్‌ తేజ్‌ మంచి స్క్రిప్ట్‌ను ఎంపికచేసుకున్నారని ఈ సందర్భంగా పవన్‌ అభిప్రాయపడ్డారట. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ధరమ్‌తో.. కొన్ని రోజుల క్రితం పవన్‌ ఓ మాట చెప్పారట.
‘ ‘ఖుషి’ సినిమా తర్వాత మంచి విజయం కోసం నేను కూడా చాలా ఏళ్ల పాటు ఎదురుచూశాను’ అని ధరమ్‌కు ధైర్యం చెప్పినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి కూడా ‘చిత్రలహరి’ బృందాన్ని మెచ్చుకున్నారు.
కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ కథానాయికలుగా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here