ఇక నుండి టెస్టుల్లో నోబాల్ వేస్తే ఫ్రీ హిట్ !

42
shami

వన్డేలు, టీ20ల్లో నోబాల్‌ వేస్తే ఫ్రీహిట్‌ ఇస్తారు కానీ టెస్టుల్లో అలా ఉండదు. అందుకే ఈ నిబంధనను టెస్టుల్లోనూ అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్‌కు మార్గనిర్దేశాలు రూపొందించే మారిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ప్రతిపాదించింది.బెంగళూరులో జరిగిన ఐసీసీ సమావేశంలో ఎంసీసీ దీంతో పాటు మరికొన్ని ప్రతిపాదనలు చేసింది. టెస్టు మ్యాచ్‌ల్లో వేగం పెంచడం కోసం ఓవర్ల మధ్య, బ్యాట్స్‌మన్‌ ఔటైనపుడు, విరామ సమయాల్లో ‘టైమర్‌’ ఉపయోగించాలని కూడా ఎంసీసీ సూచించింది. టెస్టులపై ఆసక్తి తగ్గడానికి స్లో ఓవర్‌రేట్‌ కారణమని చాలామంది అభిమానులు అభిప్రాయపడిన నేపథ్యంలో ఎంసీసీ ఈ సూచన చేసింది. అలాగే టెస్టుల్లో వివిధ దేశాల పరిస్థితుల్లో వేర్వేరు బంతుల్ని ఉపయోగించడం కాకుండా.. అన్ని చోట్లా ఒక ప్రామాణిక బంతిని వాడాలని కూడా ఎంసీసీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ల్లో జరిగే టెస్టుల్లో డ్యూక్‌ బంతిని వాడుతుండగా.. భారత్‌లో ఎస్జీ.. మిగతా దేశాల్లో కూకాబుర్రా బంతుల్ని ఉపయోగిస్తున్నారు. ప్రపంచకప్‌ తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆరంభం నుంచి ఈ ప్రామాణిక బంతిని తీసుకురావాలని ఎంసీసీ సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here