సురేష్ రైనా చనిపోయాడని వార్తలు సృష్టించిన యూట్యూబ్ చానెల్స్ !

127
Dye6F7IVYAA7vgw

భారత క్రికెటర్ సురేష్ రైనా రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయాడని కొన్ని యూట్యూబ్ చానెల్స్ తప్పుడు వార్తలు చెప్పాయి.. ఏం తెలియని వాళ్ళు కొంతమంది ఆ వార్తలను నిజమని నమ్మారు.. సురేష్ రైనా కొంత కాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకపోవడం చేత అతను ఎక్కువగా మీడియాలో ఎవరికీ కనపడలేదు.. దీంతో ఆ వార్త నిజమే అని నమ్మారు కొందరు..అయితే ఈ విషయంపై రైనా స్పందించాడు..ఆ దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను.. నాకేమి కాలేదు.. ఈ వార్తలు చూసి నా స్నేహితులు,నా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు.. ఆ యూట్యూబ్ చానెల్స్ పైన పోలీసులకు కంప్లైంట్ చేశాను..ఇక వాళ్ళే చూసుకుంటారు అని రైనా అన్నాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here