శంకర్‌ దర్శకత్వంలో మెగా స్టార్

60
Chiru- shankar

మెగా స్టార్ చిరంజీవి పేరు తెర మీద పడగానే ఫాన్స్ ఊరుతులు ఊగిపోతారు అలాంటిది తన రీఎంట్రీ తోనే బాక్స్ ఆఫీస్ రికార్డు తిరగరాసాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరం‍జీవి నటిస్తున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారికల్‌ సినిమా సైరా నరసింహారెడ్డిలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు చిరు.

అయితే ఇక్కడే ఒక చిన్న విషయం ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతుంది అది ఏంటి అంటే భారతీయుడు, రోబో, రోబో 2 .0 తీసిన విజువల్ వండర్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నార . ప్రస్తుతం కమల్‌ హాసన్‌ హీరోగా ఇండియన్‌ 2 తెరకెక్కిస్తున్న శంకర్‌, ఆ సినిమా తరువాత మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మెగా స్టార్ ఇమేజ్‌కు శంకర్‌ లాంటి దర్శకుడు తోడైతే బాక్స్ ఆఫీస్ లో సంచలనాలు నమోదవుతాయంటున్నారు ఫ్యాన్స్‌…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here