ధావన్‌ను సెంచరీ చేయనియ్యవా… ఇన్‌గ్రామ్‌

32
dhawan

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చాన్నాళ్ల తర్వాత విరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. గెలిచేదాకా క్రీజును వీడకుండా పోరాడాడు. దీంతో శుక్రవారం కోల్‌కతానైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే అన్ని ఫార్మాట్లలో శతకం సాధించిన గబ్బర్‌కు టీ20 శతకం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆ కలనెరవేరే అవకాశం వచ్చినా.. సహచర ఆటగాడు కొలింగ్‌ ఇన్‌గ్రామ్‌ రూపంలో కొట్టుకుపోయింది. దీంతో ధావన్‌ అభిమానులు ఇన్‌గ్రామ్‌పై సోషల్‌ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ధావన్‌ను సెంచరీ చేయనియ్యవా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఐపీఎల్‌ చరిత్రలోనే కెరీర్‌ బెస్ట్‌ స్కోర్‌ సాధించిన శిఖర్‌ ధావన్‌.. తన శతకం కోసం రిస్క్‌ చేయకుండా జట్టు విజయం కోసం ఆడాడు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక 8 బంతుల్లో ఢిల్లీ విజయానికి 6 పరుగులు చేయాల్సిన తరుణంలో ధావన్‌ సింగిల్‌ తీసిచ్చాడు. స్ట్రైకింగ్‌ తీసుకున్న కొలింగ్‌ ఇన్‌గ్రామ్‌.. భారీ షాట్‌తో మ్యాచ్‌ను ముగించేశాడు. దీంతో శిఖర్‌ ధావన్‌ శతకం సాధించే అవకాశం చేజారింది. . ధావన్‌ మాత్రం తన వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు గెలుపే ముఖ్యమని చెప్పుకొచ్చాడు. అందుకే రిస్క్‌ తీసుకోకుండా ఆడానని మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here