ఈరోజు చంద్రబాబు రాజీనామా

56
N-Chandrababu-Naidu

తాజా అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం అందుతున్న కౌంటింగ్‌ సరళిని చూసుకుంటే 150కిపైగా సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఘోర ఓటమి ఖాయం కావడంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయబోతున్నారు. నేటి (గురువారం) సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా చంద్రబాబు గవర్నర్‌కు పంపించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కలిసే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here