సినిమా విలన్ అనుమానాస్పద మృతి !

82
mahesh anand

విలన్ గా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు మహేష్‌ ఆనంద్ (57).. ఆయన తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో పది ఉన్నారు. ముంబైలోని అంధేరి యారీ రోడ్డులోని ఆయన ఇంట్లోనే మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన మృతికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు. భార్య నుంచి విడాకులు తీసుకున్నాక ఆనంద్ ముంబైలో ఒంటరిగానే నివసిస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు. సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆదాయం సరిపోక వ్యాపారం చేసిన ఆయన.. అక్కడా నష్టపోయారని తెలిసింది. ఇక.. శెహన్‌షా, మజ్‌బూర్, స్వర్గ్, తనీదార్, విజేత, కురుక్షేత్ర వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించారు మహేష్‌. తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ‘నంబర్‌ వన్‌’ సినిమాలో వెరైటీ విలనిజంతో ఆకట్టుకున్నారు. లంకేశ్వరుడు, ఎస్పీ పరుశురాం, టాప్‌హీరో చిత్రాల్లోనూ నటించారు. గోవింద హీరోగా నటించిన రంగీలా రాజా ఆయన చివరి సినిమా. ఈ చిత్రం జనవరి 18న విడుదల అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here