తమన్నానే పెళ్లి చేసుకుంటా !

85
shruthi2424

మిల్కీ బ్యూటీ తమన్నా ఎంత బాగుంటుందో తన నిజజీవిత క్యారెక్టర్ అండ్ బిహేవియర్ కూడా అంతే బాగుంటుందని చాలా మంది సినీ నటీనటులు ఇది వరకే చెప్పారు..తమన్నాతో హీరోయిన్ శృతి హాసన్ కి మంచి రిలేషన్ షిప్ ఉంది..వాళ్లిద్దరూ కలిసి పార్టీలు కూడా చేసుకుంటూ ఉంటారు.. అయితే శృతి హాసన్ ఈమధ్య ఒక షో లో తమన్నా గురించి చాలా గొప్పగా మాట్లాడింది..‘నేను అబ్బాయిని అయివుంటే.. తమన్నాను డేటింగ్‌కు తీసుకెళ్లేదాన్ని. అంతేకాదు పెళ్లి కూడా చేసుకునేదాన్ని. తమన్నా చాలా మంచి అమ్మాయి. తనను అంత తేలిగ్గా వదులుకోను’ అని చెప్పింది.. గతంలో వీళ్ళిద్దరూ ఒక పార్టీలో లిప్ కిస్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి.. దానిపై తమన్నా కూడా స్పందించింది..ఇన్ని రోజులు అబ్బాయిలతో వార్తలు సృష్టించారు..ఇప్పుడు అమ్మాయిలతో కూడా అని రాసేస్తున్నారు అని అన్నారు.. ఏదేమైనా ఈ పోటీ ప్రపంచంలో ఇంత మంచి స్నేహం ఉండటం చాలా మంచి విషయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here