నాగార్జునకు థాంక్స్ చెప్పిన అనుష్క !

70
Anushka-nagarjuna3x2

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్కశెట్టి సినీ పరిశ్రమలో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది.”అరుంథతి”, ‘బాహుబలి’ లాంటి భారీ విజయాలతో పరిశ్రమలో ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అనుష్క. ఈ సందర్బంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తాను ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా తనకు మొదటి సినిమా ‘సూపర్’లో ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ కు, హీరో నాగార్జునకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. సూపర్ తర్వాత డాన్, ఢమరుకం, రగడ వంటి సినిమాల్లో నాగార్జునతో కలిసి నటించింది అనుష్క.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here