నేను ఏ పార్టీకి మద్దతివ్వను కానీ అందరూ ఓటు వేయండి !

47
599b0f6993eba

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ గురువారం తన 54వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో భార్య కిరణ్ రావ్‌తో కలిసి కేక్ కట్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు. ఇది ఎన్నికల ఏడాది. దేశంలోని ప్రజలందరూ కచ్చితంగా ఓటు వేయాలి. ఎన్నికలను విజయవంతం చేయాలి అని ఆమిర్ అన్నాడు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదయ్యేలా అందరూ ఓటర్లను ప్రోత్సహించాలని బుధవారం నరేంద్ర మోదీ దేశంలోని సెలబ్రిటీలందరికీ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమిర్‌ఖాన్ తన బర్త్ డే సందర్భంగా ఓట్లు వేయాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చాడు. మరి ఎన్నికల్లో మీరు బీజేపీకి మద్దతిస్తారా అని అడిగితే.. లేదు, నేను ఏ రాజకీయ పార్టీకీ మద్దతివ్వను అని ఆమిర్ స్పష్టం చేశాడు. ఇక విదేశాల్లో ఉండే భారతీయులు, అనారోగ్య కారణాల వల్ల బ్యాలెట్ బాక్స్ వరకు రాని వాళ్ల కోసం ఎన్నికల సంఘం ఏదైనా పరిష్కారం ఆలోచించాలని ఆమిర్ కోరాడు. ఇక తొలిసారి ఓటు వేయడానికి సిద్దమవుతున్న ఓటర్లకు కూడా ఆమిర్ ఓ సందేశం ఇచ్చాడు. వాళ్లు ఎవరికి, ఎలా ఓటు వేయాలో నేను చెప్పను కానీ.. వాళ్లకు ఏం కావాలి.. తమ నియోజకవర్గంలోని అభ్యర్థి వాటిని నెరవేరుస్తాడా లేదా అన్నది చూసి ఓటేయాలి అని పిలుపునిచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here