కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో ప్రేమించిన అమ్మాయిపై దాడి !

120
coconut

భరత్ అనే యువకుడు సత్యానగర్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు.. అతని ఇంటి పక్కనే ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు..ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పాడు.. ఆమె ఒప్పుకోలేదు.. అయినా మళ్ళీ మళ్ళీ వెంటపడి వేధించడం తో ఈ విషయం ఆ అమ్మాయి తల్లితండ్రులకు చెప్పడంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు..దీంతో భరత్ తో పాటు ఆ అమ్మాయి మరియు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు..ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఈరోజు కాలేజీ కి వెళ్తున్న సమయంలో భరత్ వెళ్లి కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో ఆమెపై దాడి చేసాడు.. మీద పొట్ట భాగంలో గాయాలైన ఆ అమ్మాయిని స్థానికులు మలక్‌పేట యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు.
భరత్‌పై వేధింపుల కేసు పెట్టినందునే ఇలా చేసాడని ఆ అమ్మాయి కుటుంబసభ్యులు ఆరోపించారు. భరత్‌ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పినా ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here