హాస్పిటల్ లో రోగిపై అత్యాచారం !

69
raped

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఆదివారం ఒక నీచమైన సంఘటన జరిగింది. ‘శ్వాసకోస సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఓ మహిళను అక్కడ పనిచేసేవారే అత్యాచారం చేశారు. ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు.ఈ కేసులో నలుగురు వ్యక్తులతో పాటు, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నామ’ని మీరట్‌ సీనియర్‌ పోలీసు అధికారి హరిమోహన్‌ సింగ్‌ తెలిపారు. ఘటన జరుగుతున్న సమయంలో అక్కడి సీసీటీవీలను ఆపేశారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here