పాకిస్తాన్ సీరియల్ చూస్తుందని చితకబాదాడు !

89
Beating-Girl

ఓ వ్యక్తి తన భార్యను చితక్కొట్టాడు ఎందుకంటే సాయంత్రం ఆఫీస్ నుండి అతను ఇంటికి తిరిగి వచ్చాడు..ఆ సమయంలో అతని భార్య సీరియల్స్ చూస్తూ కూర్చుంది..ఇంటికి వచ్చిన తనను ఏమాత్రం పట్టించుకోకుండా సీరియల్స్‌ చూస్తోందని కోపం వచ్చింది అతనికి..అదే కాకుండా ఆ సమయంలో ఆమె ఓ పాకిస్థాన్‌ సీరియల్‌ చూస్తుంది.. దీంతో ఆయన కోపం మరింత పెరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె సమీపంలోని సాలిస్‌బరిలో ఆసిఫ్‌ సత్తార్‌ నయాబ్‌ అనే వ్యాపారి తన భార్యాపిల్లలతో కలిసి నివాసముంటున్నారు.అయితే సోమవారం ఉదయం ఓ చిన్న విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. అనంతరం ఆసిఫ్‌ ఉద్యోగానికి వెళ్లిపోయారు.

సాయంత్రం తిరిగొచ్చాక తన భార్య అతన్ని పట్టించుకోలేదు. పైగా పడకగదిలో మొబైల్‌లో సీరియల్‌ చూస్తూ కూర్చుంది. దీంతో ఆగ్రహానికి గురైన తను ఆమె దగ్గరికి వెళ్లి చూడగా.. ఆ సమయంలో ఆమె ‘పాకిస్థాన్‌ డ్రామా’ అనే సీరియల్‌ చూస్తూ ఉంది. నాకంటే పాకిస్థాన్‌ సీరియల్ ఎక్కువైందా అని కోపంతో ఊగిపోయిన ఆయన.. పక్కనే ఉన్న ఓ రాడ్‌తో ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటనలో ఆమె చేతి బొటనవేలు విరిగిపోయింది. వెంటనే.. తన భర్త తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here