లావుగా ఉన్నావని వెక్కిరిస్తే సొంత తమ్ముడినే చంపేశాడు !

78
sulm-me-thike-ilustrim-650x358

సమాజంలో నేరాలు ఘోరమైన సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.కొంతమంది పగతో ప్లాన్ చేసి చంపుతున్నారు.కొంతమంది జరిగిన చిన్న గొడవకు ఆవేశపడి ప్రాణాలు తీస్తున్నారు..ఇలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది..పోలీసుల కథనం ప్రకారం..నందనగరిలో ఆరిఫ్‌,నిజాం అనే ఇద్దరు సోదరులు నివాసముంటున్నారు.అయితే అన్న నిజాం లావుగా ఉన్నాడని తమ్ముడు ఆరిఫ్‌ ఆటపట్టించేవాడు. ఈ విషయంపై ఓ రోజు వాళ్ళిద్దరికీ గొడవ జరిగింది. లావుగా ఉన్నాడని వెక్కిరించినందుకు నిజాంకు కోపం వచ్చింది..ఆవేశంతో తమ్ముడు ఆరిఫ్‌ను పక్కనే ఉన్న కత్తెరతో ఛాతిలో పొడిచాడు.కత్తెర బలంగా లోపలికి దిగడంతో ఆరిఫ్‌కు తీవ్రంగా రక్తస్రావమైంది.వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.అయితే ఆరిఫ్‌ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం నిజాన్ని దాయాలనుకున్నారు. ఆరిఫ్‌ నిద్రిస్తున్న సమయంలో ఎత్తు నుంచి కత్తెర మీద పడడంతో మృతిచెందినట్లు తెలిపారు.అనుమానం రావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.అక్కడికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం చేయించారు.బలమైన కత్తెర గాట్ల వల్లే అతను మరణించినట్లు నివేదికలో వెల్లడైంది.అయితే ఆ గాయాలు కచ్చితంగా కావాలని పొడిచినవేనని వైద్యులు పేర్కొన్నారు.నిజాం కుమారుడిని విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. ఇంట్లో తన తండ్రి నిజాం..బాబాయ్‌ ఆరిఫ్‌ గొడవపడ్డట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here