క్యాబ్ డ్రైవర్ ను ముక్కలుగా కోసి డ్రైనేజీలో పడేశారు !

88
murder

కొంతమంది డబ్బుల కోసం ఎలాంటి పనైనా చేస్తారు..ఆఖరికి ప్రాణాలు కూడా తీస్తారు..అలా డబ్బు కోసం ఉబర్ క్యాబ్ డ్రైవర్‌ను చంపి.. ముక్కలు చేసి డ్రైనేజీలో పడేసారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జనవరి 29న ఈ దారుణం జరిగింది. ఫర్హత్ అలీ(34), షీమా శర్మ(30) కలిసి ఢిల్లీలోని ఎంజీ రోడ్డు నుంచి యూపీలోని ఘజియాబాద్‌కు ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. క్యాబ్‌లో వెళ్తూ డ్రైవర్ వద్ద ఉన్న డబ్బును దొంగిలించాలని ప్లాన్ చేశారు.దీంతో వారి ఇంటికి తీసుకెళ్లి టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు.ఆ తర్వాత డ్రైవర్ వద్ద ఉన్న డబ్బును తీసుకుని అనంతరం అతడిని గొంతు నులిమి చంపి.. ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ ముక్కలను గ్రేటర్ నోయిడాకు సమీపంలోని ఓ డ్రైనేజీలో పడేశారు. తన భర్త కనిపించడం లేదని ఆ డ్రైవర్ భార్య జనవరి 29న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఉబెర్ డ్రైవర్ ఫోన్ సిగ్నల్స్‌తో పాటు కారులో ఉన్న జీపీఎస్ ద్వారా పోలీసులు కేసును చేధించారు.హంతకులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here