రవిశాస్త్రి,కోహ్లీ,రోహిత్ రిషబ్ పంత్ కి చెప్పిన మాటలు ఇవే !!

183
pant

టీం ఇండియా లో చోటు సంపాదించుకుని తన టాలెంట్ ని నిరూపించుకుంటున్నాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ..కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఇతరుల పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పాడని.. ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఒక భాగమయ్యాయి. వాటిని పక్కనపెట్టలేం. అయితే మైదానం బయట ఉండే హైప్‌ను గదిలోనే వదిలేయడం నేర్చుకున్నా. ఎన్ని మ్యాచ్‌లు ఆడినా మైదానంలోకి వెళ్తే కాస్త ఆందోళన ఉంటుంది. అది మంచిదే. 50 మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన అనుభవం వచ్చినట్టు కాదని విరాట్‌ భయ్యా చెప్పాడు. ఇతరుల పొరపాట్ల నుంచి నేర్చుకొనే వ్యక్తి నాలుగు మ్యాచ్‌లు ఆడినా 50తో సమానమే అని నాతో అన్నాడు’ అని రిషబ్‌ పంత్ తెలిపాడు..

‘కోచ్‌ రవిశాస్త్రి నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆస్ట్రేలియాలో పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ఎలా ఆడాలో వివరిస్తున్నారు. క్రీజులో నిలదొక్కుకొనేందుకు కాస్త సమయం తీసుకొని తర్వాత నా శైలిలో చెలరేగాలని రోహిత్‌ భయ్యా చెప్పాడు. మానసికంగా అందుకు సిద్ధంగానే ఉన్నాను’ అని పంత్‌ తెలిపాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here