గ్లాస్ మేట్స్ పాట అదిరిపోయింది మామ !

38
D2bgKONUwAEai-W

నేను శైలజ ,వున్నది ఒక్కటే జిందగీ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కిశోర్ తిరుమల..ఇప్పుడు తన మూడో చిత్రంగా “చిత్రలహరి” సినిమాను తెరకెక్కిస్తున్నాడు..సాయి ధరమ్ తేజ్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఆమధ్య రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది..అయితే ఈ సినిమా నుండి గ్లాస్ మేట్స్ అనే పాటను నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు..ఈ పాట యూత్ తో పాటు మాస్ ని కూడా బాగా ఆకట్టుకుంటుంది..క్లాస్ మేట్స్ స్కూల్ వరకే..రూమ్ మేట్స్ రూమ్ రెంట్ కట్టే వరకే.. కానీ ఎండ్ అంటూ లేని బెండ్ కానీ రిలేషన్ షిప్ గ్లాస్ మేట్స్ అని చంద్రబోస్ ఆకట్టుకునే పదాలతో రాశారు..అలాగే రాహుల్ సిప్లిగంజ్,పెంచల్ దాస్ పాడారు.. దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ లోని ,మ్యాజిక్ ని మరోసారి చూపెట్టాడు.. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కోసమైనా హిట్ అవ్వక తప్పదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here