అలాంటి సందర్భాల్లో వారి మధ్య సంబంధాన్ని రేప్‌గా పరిగణించలేం : సుప్రీంకోర్టు

86
supreme_court

సహజీవనంలో ఉన్న పురుషుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన భాగస్వామిని పెళ్లి చేసుకోలేని పక్షంలో వారి మధ్య భౌతిక సంబంధం రేప్‌తో సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. మహారాష్ట్రకు చెందిన నర్సు ఓ డాక్టర్‌పై పెట్టిన కేసును కొట్టివేస్తూ అత్యున్నత ధర్మాసనం పైవిధంగా స్పందించింది. భర్త చనిపోయిన తరువాత ఆ నర్సు..డాక్టర్‌తో ప్రేమలో పడిందని, కొన్నాళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారని తెలిసింది. ‘రేప్‌కు, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫిర్యాదు వచ్చిన వ్యక్తి బాధితురాల్ని నిజంగానే వివాహం చేసుకోవాలనుకున్నాడా? లేదా అతనికి ఏదైనా దురుద్దేశం ఉందా? తన కోరికను తీర్చుకోవడానికి ఆమెకు తప్పుడు ప్రమాణం చేశాడా? అని పరిశీలించాలి. నిందితుడి మాయలో పడిపోవడం ద్వారా కాకుండా, అతనిపై ప్రేమ కారణంగా బాధితురాలు శృంగారంలో పాల్గొంటే అలాంటి సందర్భాల్లో వారి మధ్య సంబంధాన్ని రేప్‌గా పరిగణించలేం’అని జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.living relationship

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here